2012
లో
విడుదలయిన చిన్న సినిమాల్లోకెల్లా
పెద్ద హిట్ గా "అవును"
సినిమాని
చెప్పుకోవచ్చు.
రవి
బాబు దర్శకత్వంలో సురేష్
బాబు తో కలిసి సంయుక్తంగా
నిర్మించిన ఈ సినిమా తక్కువ
బడ్జెట్ లో రూపొందినప్పటికీ
భారీ స్థాయిలో కలెక్షన్స్
సాధించింది.
హర్షవర్థన్
రాణే,
మరియు
పూర్ణ నటించిన ఈ హారర్ చిత్రం
పోస్టర్స్ అప్పట్లో అందరినీ
ఆకట్టుకున్నాయి."అవును"
విజయవంతం
కావడంతో ఇప్పుడు అదే సినిమా
కి సీక్వెల్ గా "అవును
- పార్ట్
2” వస్తోంది.
రవి
బాబు దర్శకత్వంలో సురేష్
బాబు తో కలిసి -"సురేష్
ప్రొడక్షన్స్"
మరియు
"ఫ్లైయింగ్
ఫ్రాగ్స్"
సంస్థలు
ఈ సీక్వెల్ ని నిర్మిస్తున్నాయి.
షూటింగ్
ముగించుకుని ప్రస్తుతం పోస్ట్
ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాకి
సంబంధించిన ట్రైలర్ ఈ వారాంతంలో
విడుదలవ్వబోనుంది.
గతంలో
"అవును"
ట్రైలర్స్
కి వచ్చిన రెస్పాన్స్ దృష్ట్యా
"అవును
-పార్ట్
2” ట్రైలర్
కూడా చాలా ఇంట్రస్టింగ్ గా
ఉండబోతుందని సమాచారం.
మొదటి
సినిమాలో నటించిన హర్షవర్థన్
రాణె మరియు పూర్ణ ఈ సినిమాలో
కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
శేఖర్
చంద్ర ఈ చిత్రానికి సంగీతం
అందించారు
Post a Comment Blogger Facebook