బ్లాక్‌మణితో వస్తున్న కొత్త హీరో..!
బ్లాక్‌మణి
అన్నాహాజారేతో మొదలైన ప్రభంజనం ఎంతటి ప్రలయాన్ని సృష్టించిందో తెలిసిందే.
ఒకదశలో దానివల్ల ఓకొత్త పార్టీ పుట్టుకొచ్చి అధికారం కూడా చెపట్టింది.
అలాంటి బ్లాక్‌మణి పేరుతో ఓ సరికొత్త చిత్రం రాబోతోంది. పవన్ రెడ్డి,
సిద్ధార్ద్ రెడ్డి, అంజలిరావ్, సునీల్, కిషక్షర్ రాజ్‌కుమార్ ప్రధాన
పాత్రధారులుగా వర్ష అర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘2000
కోట్ల బ్లాక్‌మణి’. ఈచిత్రం ఈమధ్యే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా
దర్శకుడు మాట్లాడుతూ...‘ఇండియాలో తొలిసారిగా రెడ్ స్కార్లెట్ డ్రాగన్‌తో సినిమాని పూర్తి చేశాము. రాబరి,
పాలిటిక్స్, ఇన్‌వెస్టిగేషన్ ప్రధానాంశాలుగా వైవిధ్యభరితంగా హాలీవుడ్
తరహా కథనాన్ని ప్రేక్షకులకి అందించడం జరిగింది. మిగిలిన కార్యక్రమాలు
త్వరలోనే పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నాము. ఈచిత్ర విశేషాలను .2000crore.com,
facebook page 2000crore-blackmoney లో చూడవచ్చు అన్నారు. లక్ష్మినారాయణ,
భాషా, రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దివ్య, డైరెక్టర్ ఆఫ్
ఫోటోగ్రఫీ: ఉదయ్, కథ, స్కీన్‌ప్లే, మాటలు, నిర్మాత:పవన్ రెడ్డి, సంగీతం,
దర్శకత్వం:రమేష్ ముక్కెర తదితరులు ప్రధానా పాత్ర పోషించారు
Post a Comment Blogger Facebook