యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘టెంపర్’ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే…
‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన పూజా హెగ్డె అయితే ఎన్టీఆర్ సరసన బాగుంటుందని భావిస్తున్నారట. మరోవైపు ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన రాశిఖన్నాని ఎన్టీఆర్ సరసన నటింపజేస్తే ఎలా ఉంటుందాని ఆలోచిస్తున్నారట.
మొత్తం మీద ఈ ఇద్దరినీ పరిశీలిస్తున్నారు కాబట్టి… ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఎన్టీఆర్ తో జత కట్టే అవకాశం దక్కుతుందని చెప్పొచ్చు. ఈ ఇద్దరిలో ఎవరికీ ఈ సినిమాలో నటించే అవకాశం దక్కినా, ఖచ్చితంగా మంచి ఆఫర్ కాబట్టి… ఈ ముద్దుగుమ్మలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
Post a Comment Blogger Facebook